27, ఫిబ్రవరి 2009, శుక్రవారం

ఒంటరి గా ఇంకో రాత్రి...


కృష్ణా.. ఏమి చేస్తున్నారు...

టెక్నాలజీ టెక్నాలజీ ఎటు తీసుకెళుతున్నావే అంటే నీ వునికి నీ తేజస్సు నేను లాగేసుకునే వరకు అంది అట . అలా వుంది మన పరిస్తితి . రాత్రి నుంచి మంచు పడుతుంది , ఫోన్ లేదు , టీవీ లేదు , ఇంటర్నెట్ లేదు, అమ్మయ్యో కరెంటు అయినా వుంది . ఈ దేశం లో అన్ని వుంటే మనమే రాజులం , ఒక్కటి కొంచం తేడా వచ్చినా ఏమి చెయ్యలేని బందీలము కదు . తమాషా గా వుంటుంది ఆలోచిస్తే , దేనికి ఆధార పడనవసరం లేని స్వతంత్రత , కాలు కదపటానికి కూడా వీలుకాని నిస్సహాయత రెండు పెనవేసుకుని పక్క పక్క నే మనతో నే వుంటాయేమో .

సరే ఈ గోల కేమి కాని ఏమి చేస్తున్నారు.. జన జీవన ప్రవాహం.. గల గల సాగే స్రవంతి... ఏమి వుంటుంది చేసేందుకు... వద్దు అన్నా వుహుఅన్నా సాగిపోవటం తప్ప అంటారా?

నీవున్నవన్న వుహే
నాకింకా ఈ ప్రపంచం తో పోరాడే శక్తి నిస్తోంది..
చిరునవ్వు తో వెలిగే నీ మోము
నాకు చీకటి వైపు చూడగలిగే ధైర్యాన్ని ఇస్తోంది...
నీవేగా నేస్తం ఈ రాకాసి ప్రపంచాన్ని
నీ మమతల మాయాజాలం తో
సుందర స్వప్నం చేసి నిలుపుతోంది..

అబ్బ ఈ చలి పులి వచ్చి చంపేస్తోంది.. బయటకు వెళితే చలి ఇంట్లోనేమో ఈ పిచ్చి వేడి తో విసుగు... ఈ పని... వంట... విసుగు పుడుతోంది... చదువుకునే రోజుల్లో ఎంత విర్ర వీగే దాన్ని.. నేను వీళ్ళందరి లా కాదు ప్రత్యేకం గా గడుపుతాను జీవితం అని... ఇప్పుడు తలుచుకుంటేనే నవ్వు వస్తోంది..

ఏమన్నావు కృష్ణా కిందటి సారి వుత్తరం లో చలం ప్రేమ లేఖలు ఎప్పుడైనా ఖాళీ గా వున్నప్పుడు చదువుదామని తీస్తే దాని బదులు ఒరాకిల్ పుస్తకం తిరగ వేస్తె రేపు స్టూడెంట్స్ కు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే చేయించేటప్పుడు వుపయోగం కదా అనిపిస్తోందా... ఎవరు నా కృష్ణే నా అలా అంటోంది...

గుండెకు వచ్చే వెక్కిళ్ళను తీర్చే ఒకే మంత్రం మంచి సాహిత్యం అని...

నిన్నటి నీ స్వప్నం ప్రియా ఇంకా నా నిద్ర రాని నిశీధి వీధుల తారాడుతూ పలుకలేని పదాలను
కన్నీళ్ళతో కదంబ మాలికలల్లుతూ, జారిపోయే కాలాన్ని జావళీలు గా మార్చి నాకు అందించింది...
నేస్తం నేటికి స్వప్నమే నీకు బరువైతే జీవితమేమవుతుందో నాకు .........
అంటు... విరహాన్ని కవితలల్లి ఇచ్చిన నా కృష్ణే నా ఇలా మాట్లాడేది
కాలమా నీకిదే నా జోహార్లు..

ఇక్కడ అంటా ప్రశాంతం గా వుంది... అర్ధ రాత్రి నేను నా పాటలు తప్ప ఎక్కడ ఏమి చప్పుడు లేదు, దూరాన హైవే మీద కూడా దీపాల తోరణాల జోరు తగ్గి అప్పుడొకటి అప్పుడొకటి పరుగెడుతూ వున్నాయి.. బయట పాపం ఏదో పేరు తెలియని చెట్టు నెమ్మది గా చలి కి కదులుతూ తన బాధ చెప్పుకుంటోంది.. అరె అంతా ఆకులతో పువ్వులతో వున్నప్పుడు అందరు నన్ను ఎంతో మెచ్చుకుంటారు కదా ఇప్పుడు ఆ ఆకులే వుంచుకోలేక వుంచుకోవటానికి వీలు కాక వదిలేస్తే విసుక్కుంటూ వూడుస్తారు, అప్పుడు అప్పుడు తల పైకెత్తి నావైపు విసుక్కుంటూ ఇంకా ఎన్ని ఆకులు వున్నాయా అని చూస్తూ లెక్క పెడతారు... ఇప్పుడు ఇంత చలి తో బాధ పడుతుంటే అయ్యో అనైనా అనరు.. రేపు నా కొమ్మలంతా మంచు తో నిండి బరువుతోనే వంగిపోయి నుంచో లేక ఆధారం సరిగా లేక బాధ పడుతుంటే అబ్బ ఈ చెట్టు నిండా మంచు తో బలే అందం గా మెరుస్తోంది అంటారు ఎంత స్వార్ధ పరులు మీరు అని చెప్పుకుంటోంది.. ఏమి బదులు చెప్పలేక కిటికీ పరదా పూర్తి గా లాగేసి వచ్చాను..

దానికేమి తెలుసు మన బాధ.. ఎంత వున్నా ఇంకా ఏదో కావాలని పరుగు... మనుగడ కోసం పరుగు... దాని తరువాత లగ్జరీస్ అవసరాలవుతాయి.. అప్పుడు ఇంకా ఇంకా వాటి కోసం పరుగు... దాని తరువాత ఇంకా దేనికో పరుగు... మొత్తం మీద పరుగో పరుగు.. చివరకు వెనక్కి తిరిగి చూసుకుందుము కదా.. చేసినా దానికి విచారిస్తూ ఇలా కాదు అని ఇంకో దారి మళ్ళి పరుగో పరుగు.. చాలు ఇంక ఆపు తల్లి అంటారా.. ఏమో కృష్ణా నా పరుగు మాత్రం గమ్యం నే పుట్టినప్పుడే నిర్దేసించ బడిందేమో నీ వైపుకు.. ప్రపంచం లో ఎక్కడ దొరకని శాంతి సంతోషం నాకు నీ చేతుల మద్యలో నే దొరుకుతుంది..
మరి నన్ను వదిలి ఎందుకు పరుగెట్టేవు అని మౌనం గా నే మీ కళ్లు అడుగుతున్నాయి ఈ వుత్తరాన్ని నాకు తెలుసు.. కాని దానికి సమాధానం కూడా మీకే తెలుసు నేను చెప్పనక్కర్లేదు.. ఈ నల్ల పిల్ల ఈ పరుగు మీరు నిర్ణయించిందే కదా.. భూమి గుండ్రం గా వుంది కృష్ణా ఎటు వెళ్ళినా ఒక రోజు మీ చేతుల మద్య మళ్లీ ఒంటరి సాన్నిహిత్యాన్ని అనుభ వించటంకోసమే ఎదురు చూస్తూ మరి సెలవిక... కలల వుషోదయానికి పరుగిక...

13 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

"గుండెకు వచ్చే వెక్కిళ్ళను తీర్చే ఒకే మంత్రం మంచి సాహిత్యం అని..."
...యెంత బాగా చెప్పారండి...

మురళి చెప్పారు...

మరో చిన్న సూచన.. ఎటూ కామెంట్ మోడరేషన్ ఉంది కాబట్టి, వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి.. కామెంట్ రాసేవాళ్ళకి కొంచం సులభంగా ఉంటుంది..

భావన చెప్పారు...

మురళి: ధన్యవాదాలు... పంచుకునే భావం పలకరించే హృదయం దొరికేది స్నేహం లోను... సాహిత్యం లోనే కదండీ... తీసేసేను వర్డ్ వెరిఫికేషన్.... సదా మీ సేవ లో (సినిమా పేరు లా వుందా ;-) )

పరిమళం చెప్పారు...

"గుండెకు వచ్చే వెక్కిళ్ళను తీర్చే ఒకే మంత్రం మంచి సాహిత్యం "ఎంత బావుందీ .....భావన గారూ ! అందమైన మీ భావాలకు జోహార్లు .

భావన చెప్పారు...

భావమైనా పరిమళమైనా.. ఆస్వాదించే మనసు విలువలోనే కదా వుండేది నచ్చినందుకు ధన్యవాదాలు..

నేను చెప్పారు...

రేపు నా కొమ్మలంతా మంచు తో నిండి బరువుతోనే వంగిపోయి నుంచో లేక ఆధారం సరిగా లేక బాధ పడుతుంటే అబ్బ ఈ చెట్టు నిండా మంచు తో బలే అందం గా మెరుస్తోంది అంటారు ఎంత స్వార్ధ పరులు మీరు .......
మాటలు లేవు విప్పారిన కళ్ళలో ఆశ్చర్యం తప్ప. భావాలు లేవు ఇన్నాళ్ళూ ఉన్నవి ఇంత స్వార్ధంతో కూడినవా అన్న అయోమయం తప్ప.....

భావన చెప్పారు...

స్పందన గన్నేరు పూరెక్క మీద వాలిన నీటి చుక్క ఆ అందానికి ప్రకృతి ఇచ్చిన బహుమానమా లేక ఆ సిందురాన్ని చూసి ఈర్ష్య పడిన వానదేవుడి వుడుకుమోతు తనమా అంటే ఏమని చెప్పగలం చెప్పండి.. మీరు అంత అందమైన పువ్వులతో మమ్ములనూ పడేస్తున్నారు అయోమయం లో మరి.. :)

సుజాత వేల్పూరి చెప్పారు...

భావన గారు,
మీ భావాలు చాలా లలితంగా ఉన్నాయి. మీ బ్లాగు ఆలస్యంగా చూశాను. అదీ "ఇదేమిటి నా బ్లాగులో?"అని ఆశ్చర్యపోతూ! చూస్తే ఇది మీ బ్లాగు.

ఒక్క చిన్న అభ్యర్థన. నా బ్లాగు పేరూ ఇదే. ఒక ఏడాది అయిందనుకోండి మొదలై. నా పేరుతో మరో ఇద్దరు బ్లాగర్లుండటంతో నా బ్లాగు పేరు నా పేరుకు జోడించి రాయడం అలవాటైపోయింది కూడా!

పైగా ఈ మధ్యే చూశాను, ఇదే పేరుతో మరొకరి బ్లాగు. అందువల్ల మీరు ఏమీ అనుకోనంటే(అన్యధా భావించరని తలుస్తాను) మీ బ్లాగు పేరు మార్చగలరా? కృష్ణపక్షం అనే పేరు నిజంగా అద్భుతంగానే ఉంది.

ఒక మిత్రురాలు మనసులో మాట పేరుతో 3 బ్లాగులుండే సరికి ఏదెవరిదో తెలీక తికమక పడుతున్నాం అన్నాక ఈ వ్యాఖ్య రాస్తున్నా ధైర్యం చేసి. ఎవరి రాతలు వాళ్లవే అనుకోండి.అయినా ఒకసారి రిక్వెస్ట్ చేసి చూద్దాం అని రాస్తున్నాను.

భావన చెప్పారు...

సుజాత గారు, నమస్తే.. క్షమించాలి మనసులో మాట అనే పదం మీ అందరి బ్లాగ్ లు చూడకుండా మొదలు పెట్టేను.. తరువాత మీ బ్లాగ్ చూసేను కాని బ్లాగ్ చిరునామా వేరు గా వుంది కదా క్రిష్ణ పక్షం అని అలక్ష్యం చేసేను... తప్పకుండా మారుస్తానండి.. ఒక రెండు రోజులు వ్యవధి ఇవ్వండి.. ఈ రోజు రేపు కుదరక పోవచ్చు.. ఆదివారం లోపు మారుస్తాను.. మిమ్ములను కష్ట పెట్టి వుంటే క్షమించాలి.. ఇంకో మనసులో మాట ఎవరిది అండి...?

సుజాత వేల్పూరి చెప్పారు...

భావన గారు,
థాంక్యూ వెరీ మచ్! అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.తొందర లేదు. వీలైనపుడే చేయండి. ఇంకో మనసులో మాట ఇక్కడుంది చూడండి.


http://swarnayugam.blogspot.com/2009/02/blog-post_22.html

మురళీ కృష్ణ చెప్పారు...

what happened after February 27, 2009? No more new posts :-?

ఉమాశంకర్ చెప్పారు...

"చదువుకునే రోజుల్లో ఎంత విర్ర వీగే దాన్ని.. నేను వీళ్ళందరి లా కాదు ప్రత్యేకం గా గడుపుతాను జీవితం అని... ఇప్పుడు తలుచుకుంటేనే నవ్వు వస్తోంది.."

బహుశా ఎవరూ ఈ ఆలోచనకి అతీతులు కాదేమో.. :)

మీ బ్లాగు బావుందండి. మీరు నాబ్లాగులో రాసిన వ్యాఖ్యలకి సమాధానం నేను ఏ అర్ధరాత్రో, లేదా వేరే పనుల్లో బిజీగా ఉన్నప్పుడో ఇచ్చినట్టున్నాను, మీ బ్లాగు చెక్ చేద్దామన్న ఆలోచన రాలేదు.. ఇప్పుడొచ్చి చూసాక అర్ధమయింది ఇలా ఆఫీసులొ ఇలా పైపైన చదివితే కుదరదని.. ఈరొజు ఇంటికెళ్ళాక చదవాలి..

భావన చెప్పారు...

@మురళీ క్రిష్ణ గారికి,
క్షమించాలి కొంచం పని వత్తిడి లో క్రిష్ణ గానాన్ని పెదవి దాటనివ్వలేక పోయాను...

@ఉమా గారు,
నిజమే నండి అందరికి ఆ కొంచం తల పొగరు వుంటుంది అనుకుంటా చదువుకునే రోజుల్లో...
అందుకేగా జీవితం చిత్రమైన దెబ్బలు కొట్టి దారిలో పెడుతుంది :-)
ధన్యవాదాలు నా బ్లాగ్ నచ్చినందుకు..