కృష్ణా,
ఎన్ని రోజులు గడిచినా తరగని ఈ కత, చెదరని ఈ వెత ఎందుకో నీతో పంచుకోవాలనిపిస్తుంది. నువ్వు ఏదో పరిష్కారం వెతుకుతావని కాదు... అసలు జీవితం లో ఏ సమస్య కైనా పరిష్కారం వుంటుంది అంటారా? అసలు సమస్యే లేనప్పుడు పరిష్కారానికి తావెక్కడ వుంటుంది... సమస్యా నీ మనసే దాని పరిష్కారం నీ మనసే అంటారేమో వేదాంతులు.. నిజమే... కాని దానిని సంపూర్తి గా అర్ధం చేసుకుని ఆచరించటానికి ఎంత dedication వుండాలి కదా....
అదే వున్నప్పుడు ఈ వెతుకులాట ఎందుకు... అంతా అంతమై పోతుంది.. అంతా ప్రశాంతత అంతటా నీరవం... నిశ్శబ్దం , ఆ అచంచలమైన నిశ్శబ్దం లో నుంచి వుదయించే తొలి నాదం ఓం కారం.. అదేనా మన ప్రేమ కు శ్రీకారం ? మనదే కాదేమో ప్రేమ అనే పదానికే తోలి సాకారం... అవునా మన ప్రేమ అప్పటినుంచే అలా అనంతం గా సాగుతోందా? ఎప్పటికి కలవని సమాంతర రేఖలలా? ఎప్పటికి ముగియని కాలం లా..! అంతలోనే ముగిసి పోయిన ఒక సంధి కాలంలా... అదేనా మన ప్రేమ... ప్రేమ అనంతం.. అమరం అంటే అర్ధం అదేనేమో
ఒక్కసారి కలిసిన తరువాత ప్రేమ అంతా ఈ కలియుగపు కాల గర్భం లో పడిఈ సమాజపు మర్యాదల పద్దతుల కట్టుబాట్ల చట్రం లో పడి ఒక రూపం అదీ సభ్య సమాజం అంగీకరించే రూపం పొందవలసినదే... అవునా కృష్ణా.... ఏమో నాకైతే తెలియదు.. నాకే కాదు.. ప్రేమించే ఎవరికి తెలుస్తుంది చెప్పండి... ప్రేమిస్తే? ప్రేమిస్తే చూడాలి... మాట్లాడాలి.. కలవాలి.. కబుర్లు చెప్పుకోవాలి.. భౌతికమైన బంధం.. ఆ బంధాలకు రూపాలు... వాటిలో మన ప్రతిరూపాలు.. వీటన్నిటితో సాఫల్యమనుకోవటం... లేదంటే విరహవేదనలలో కృంగి దుఃఖ సముద్రాలలో మునిగి పోవటం... ఇంక ఎప్పుడో ఎక్కడో ఇక్కడో మరుజన్మకో అనే ఆశ తో మిగలటం.. అంతేనా ప్రేమ? అంతేనేమో అంతేనా.......
ఏమో కృష్ణా ఎన్నో ఆలోచనలు... సముద్రపు కెరటా లకు మల్లె అనంతం గా ఒక దాని వెంబడి ఒకటి ఒక దాని మీద ఇంకోటి... చాలా రోజులయ్యింది కలం తో కాగితం మీద నలుపు చేసి.. నా రాత నాకే అర్ధం కాకుండా వస్తోంది.. నా జీవితమే నాకు అర్ధం కాదు ఇంక ఈ రాత ఎలా వుంటే మాత్రం ఏమి లే అసలు జీవితం ఎవ్వరికైనా అర్ధం అవుతుంది అంటారా? ఇలా ఆలోచిస్తూ పొతే అబ్బ అర్ధం లేని ఆలోచనలు అనిపిస్తుంది... కాని నిజానికి అదే జీవితమేమో.. ఆలోచనే జీవితం ఆలోచన ఆగిన క్షణంo ఈ జీవితం కూడా ఆగుతుంది.. ఆగక సాగే ఆలోచన కు అనుసంధానం గా సాగేదే జీవితం... అరె... ఈ ఆలోచన ఏదో బాగున్నట్లు వుందే!
ఐతే మరి ఆగక సాగే ఆలోచన అంతా నువ్వే ఐనప్పుడు నా జీవితం నువ్వేనా ! నా జీవితం నువ్వే అయినా కూడా నువ్వు ఎక్కడా కనపడకుండా వుండటమేనా జీవితం .. అందులోని మెలోని ... ఒక్కొక్క క్షణం నాకు అదే అనిపిస్తుంది . కృష్ణా నేను మిమ్ములను ప్రేమించానా....... మీ వునికిని ప్రేమించానా..... మీ వూహను ప్రేమించానా ... మీ ఆకారాన్ని ప్రేమించానా .... మీ మీద ఆశ ను ప్రేమించానా .. ..మీతోటి జీవితాన్ని ప్రేమించానా... మీ ఆత్మ ను ప్రేమించానా ... అసలు మిమ్ములనే ప్రేమించానా .... ప్రేమించాలి అనే ఆశ తో మిమ్ములను , మీరు అనే అస్తిత్వాన్ని ప్రొదివి గా చేసుకుని నన్ను నేనే ప్రేమించానా ఎన్నో ప్రశ్న లు.... ఎన్నెన్నో ఆలోచనలు .. ఎవరు చెపుతారు ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు ..
మా మధు బాబు గారైతే వెంటనే ఒక పాట లా పాడతారేమో ప్రేమా ఏమిటి ఈ అర్ధం కాని గామా హంగామా , ఎవరికీ అంతుపట్టని ప్రశ్నల డైలమా అని , లేదంటే .........ఏమిటి అండి బాబు ... ఈ ప్రశ్నల తోరణాల పూరణాలు .. ఎందుకు మాకీ శిక్ష అంటారేమో .. అవునేమో ... ఏది అబద్దం కాని ప్రతి సందేహం ఒక అర్ధం లేని ప్రశ్న తో కలుపుతున్నానా ?
మనసు మూగైన నిమిషం
నిమిషాలే యుగాలవుతాయి
కనురెప్పల వెనుక నీటి చుక్కే సముద్రమై ....
మనలను ముంచేస్తుంది .......
సాగరమైనా ... యుగాల దూరమైనా ...
కలిసి సాగే పాదం తో కలిపి దాటెయ్యగలమ్
కాని మన పాదాలే ఆవిటివై కదలలేనప్పుడు
ఎలా దాటగలను నేస్తం ... దూరాలేవైనా ఎంతున్నా ........
2 కామెంట్‌లు:
"మన ప్రేమ అప్పటినుంచే అలా అనంతం గా సాగుతోందా?"
ఎంత నిజం? జన్మజన్మల బంధం అంటే ఏంటీ పాతబడిన సినిమా డయలాగు అనిపిస్తుంది. టగూరు పద్యమొకటుంది.
We played alongside millions of lovers through as many births .."అని. కానీ సూక్షమం తెలిసినవారికి .. ఆ మిలియన్లలోనూ వెలిగే జ్యోతిస్వరూపం ఒకటే. అదే ప్రేమ. అదెప్పుడూ అనంతమే.
ప్రేమ అనంతం... అది విసిరే సవాళ్ళు అనంతానంతం.. ఎదుర్కోలేని వాళ్లు....... ఎదిరి పోరాడే వారు........ పోరాడి ఓడే వారు..... తెలిసి జీవితాన్ని సాఫల్యం చేసుకునే టాగోరు లెందరు???????
కామెంట్‌ను పోస్ట్ చేయండి