13, ఆగస్టు 2009, గురువారం

కృష్ణయ్య పుట్టిన రోజు పండుగ



క్రిష్ణయ్యా, ఈ రోజు నీ పుట్టిన రోజు... ఐనా నీకు పుట్టిన రోజేమిటి మా పిచ్చి కాని..... ఆది, అంతాలే లేక సర్వ వ్యాపకుడివైన నీకు ఒక రూపాన్ని, ఒక రోజు ను, ఒక పండుగను నీకోసం కల్పించి మేము చేసే ఈ వేడుక అంతా నీ లీలా వినోదాలలో ఒక భాగం కాదు.... ఐనా మా కోసం మాలో ఒకడి గా చేరి వెన్న తింటు, అల్లరి చేస్తూ, మువ్వలన్ని గల గల మంటు సాగే కాల ప్రవాహమల్లే నువ్వు వేసే గంతులు.... ఇవి అన్ని మా కోసమే కదు...


క్షణం క్షణం పసి పాపల చిలిపి అల్లరిలో వాళ్ళ చిరు ఆనందం లో, ఇంటి ముందు గంతులేసే తువ్వాయి చురుకు చూపులలో.... పెరట్లో విరిసిన రాధా మనోహరం మొగ్గ అంచున రూపుదిద్దుకుంటున్న ఎరుపు వర్ణపు ప్రేమ ఆనవాలు లో, విరిసిన చంద్రవంక లో తళుకులీనే చంద్ర కాంతి తో కలిసి అంచున వూయలలూగుతూ అవ్యక్తా వ్యక్తం గా వినిపించే నీ అనంత వేణు గానం లో..... ప్రతి అణువణువులో నిన్ను ప్రతి క్షణం గుర్తు పట్టిన ఆనందం తో యశోదనై రోజు నీ పుట్టిన రోజు జరుపుకుంటున్న నన్ను మన్నించి నా ముంగిటకు మళ్ళీ మళ్ళీ అన్ని రూపాలలో....... ఏదో ఒక రూపం లో రావూ...!!!!


ప్రతి క్షణం నిను ఏదో అడిగి, ఇంకేదో కావాలని కోరి... ఇచ్చినదాని విలువ తెలియక...... అది విసిరేసి మళ్ళీ ఇంకేదో కావాలని ఏడ్చి.. విలువైన బొమ్మ ను విసిరేసి అట్ట పెట్టెను చూసి ఆనంద పడి దానిలోని కాగితపు ముక్కలే అనంత సంపదలని భ్రమసిన నన్ను, తండ్రి లా నువ్వు అది తీసి పక్కన పెట్టి విలువైన జీవితాన్ని కానుక గా ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటే వద్దని పేచి పెట్టే పసి బిడ్డను క్షమించి నా ముంగిటకు పసి వాడై నేను నీకు జరిపే క్రిష్ణాష్టమి ను జరిపించుకోవటానికి రావూ...


యుగం కితం నా వంటి ఒక పేద తల్లి మమత ని, ఇంకో అధ్బుత ప్రేమ మూర్తి ఆరాధన ను, కొన్ని కోట్ల మూగ జీవుల ఆర్తి ని అన్నిటి కోసం, అందరి కోసం రోజే వచ్చావట లోకానికి క్రిష్ణ నామం తో, క్రిష్ణ తత్వం తో, క్రిష్ణ ప్రేమ తో......అంతా నేనే, నేనే ఎప్పటికి, అంతా నాదే అనే మా కంస ప్రవృత్తి ని అణచటం కోసం ఏతెంచావంట రోజే... మా అహంకారం, పశు ప్రవృత్తి ని పిడి గుద్దులతో అణిచేవంట లే విన్నాను కథ లు... మా కోపాన్ని ఈసు అసూయలను కూడా కాళీయ మర్ధనం చేసి మా పీచమణిచావంటలే... నల్ల నల్లని మేఘమై నీల మేఘ శ్యాముడివై మా మీద నీ ప్రేమామృతాన్ని వెన్న లా, వేణు రాగం లా మా మీద కుండలతో, బోలైన జీవిత వేణువులతో వంపి వర్షించావంటలే..


ఐతే ఏం...ఎప్పటి కథే... ఎప్పటి వెతే.. .అన్నీ మర్చి మళ్ళీ ఖాళి కుండ తో నీ పూ పొదరింట నుంచు ని నీ కరుణామృతం కోసం నిలబడిన యాచకురాలిని మన్నించి మళ్ళీ ఒక్క సారి మా ముందుకు పసి బిడ్డ వై క్రిష్ణాష్టమి కి వచ్చెయ్యవా.....

చూడు దారి గుర్తు పట్టవేమో అని నీ కోసం నీ చిన్ని పాదాలను ముద్రించి వుంచేను .. అమ్మ కోసం పాదం లో పాదం,పదం లో పదం కలిపి నీ చిట్టి అడుగులతో వచ్చెయ్యి లోపలకు నా చిన్ని కన్నా... నీకోసం నా ప్రేమ ను నా ఆప్యాయతను అన్నిటిని అంతా కలిపి నీ కోసం వెన్నుండలు చేసేను, తీపి పాయసం చేసేను, ఆటుకులను పాలతో బెల్లం తో కలిపి తీపి తీపి తాయిలాలు, భక్ష్యాలు చేసేను.. ఈ ఇంటినే ఒక మధుర చేసేను.. నచ్చలేదా.. ఈ కంస ప్రవృత్తి మద మత్సరాలను రాక్షసులు గా నా బిడ్డవైన నీ మీదికే పంపుతోందా, వద్దా.... సరే పద బృందావనం వెళ్ళి పోదాము...


దొంగా తళుకులీనే నవ్వు చూడు, నాకు తెలుసు లే నీ వేషాలు బృదావనం ఐతే నీ ఆటలన్నీ సాగుతాయని కదు... ఎప్పుడైనా యశోదమ్మ నీ ఆట కాదందా నీ మాట కాదందా... ముందు మధుర గా మలుచుకున్న అంతరం లోకి ప్రేమమూర్తి వై రా, తరువాత ప్రేమైక లోకమైన బృదావనం వెళదాము.. వుట్టి కూడా కొడదాము.. మరి పిచ్చి తల్లి కోసమో, నీ మురిపాల రాధ కోసమో, నీ దాసాను దాసులైన నీ లోని రూపాలమైన అందరి కోసమో వచ్చేస్తావు కదు


ప్రేమతో
యశోదమ్మ పంపుతున్న ఆహ్వాన పత్రం...


15 కామెంట్‌లు:

సుభద్ర చెప్పారు...

కిట్టయ్య పేరు పెట్టుకున్న మీకు నేను అల్ ది బెస్ట్ చెప్పట౦ ఎ౦టి?సిల్లి గా లేదు.
నొ వర్ద్స్ ఉమా!చాలా చాలా బాగు౦ది.మీరు ప్రమదవన౦ వచ్చిన కొత్తలో మీ బ్లొగ్
చుసా,మల్లి ఇదే చుడట౦....చాలా మిస్స్ అయ్యా అని నన్ను నేనే తిట్టుకు౦టు...
ప్రతిసారి నిన్నేదో అడిగి,ఇ౦కేదో కావాలని కొరి......ఆ పేరా చాలా బాగు౦ది.
చుడు ఈ దారి......లినమైపోయా ఇక్కడ....
ఆఖరున ప్రేమ తో,
యశోదమ్మ ప౦పే ఆహ్వనపత్ర౦ అ౦టు....సుపెర్ ముగి౦పు..
మొత్త౦ గా కెవ్వు కేక..

సుభద్ర చెప్పారు...

మీ పొస్ట్ చుసాక నాకు అన్పిస్తు౦ది,కిట్టయ్య తనుకు తానే మీ దోడ్లో రొలుకు కట్టేసుకు౦టాడేమో!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

నయనాలనుండి ఆనందాశ్రువుల జలపాతాన్ని ప్రవహింపజేసారు.

మురళి చెప్పారు...

మాటల్లో చెప్పలేని అవ్యక్తమైన అనుభూతి కలిగిందండీ చదువుతున్నంతసేపూ... కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

మాలా కుమార్ చెప్పారు...

యశోదమ్మ తో కిట్టయ్యని అంత ఆర్తిగా పిలిపించటము మీ కే చెల్లు. సూపర్
కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

Vani చెప్పారు...

భావనా, నాకు మాత్రం గోపిక వలె నీ పై ఈసు కలుగు తున్నది. అంతగా ఆహ్వానం పలికి మధుర పదార్దాలు చేసిన నీదగ్గరకు రాక కేవలం కళ్ళనిండా ఆశతో మనసు నుండా ఉద్వేగం తో చూస్తున్న నా దగ్గరకు వస్తాడా? తనకోసం ఏమి సిద్దం చెయ్యలేక పోయ్యనే? కాని రావాలని ఆశ. ఒక రూపం లో కాదు అన్ని రూపాల్లో కావాలి [:)]

నేస్తం చెప్పారు...

చాలా బాగా రాసారు :)

శ్రీలలిత చెప్పారు...

భావనగారూ,

కృషుణ్ణి చూడ్డానికి మీ ఇంటికి ఎప్పుడెప్పుడు రావాలా అన్నంత ఆత్రుతగా వుంది.

జ్యోతి చెప్పారు...

కన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు...

పరిమళం చెప్పారు...

ఆహా చిన్ని కృష్ణుని పాద పద్మాలు !
అన్ని తాయిలాలు పెట్టాక ఆగకేమవుతాయి ?
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు .

మధురవాణి చెప్పారు...

భావన గారూ,
ఇంత ప్రేమగా పిలిచాక ఆ చిన్ని కృష్ణుడు మీ ఇంటికి రాకుండా ఉండగలడా.?
రావడమే కాదు, ఎప్పటికీ మీతోనే ఉండిపోతాడు. ఇది తథ్యం సుమండీ :)
మీక్కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

మరువం ఉష చెప్పారు...

కృష్ణగీతం గంగా ప్రవాహమై, అమృతమయమై యశొదమ్మ కంటి కాంతులై ముంగిటి దీపమై... ఇలా ప్రవహించగా చదివి నేను తరించనా, భావనా, you're so unique so adorable an image that you create in the reader's mind...

భావన చెప్పారు...

సుభద్ర:నీ కేక వినపడింది.. నీ ఆల్ ది బెస్ట్ ఎప్పుడు కావాలి నాకు. కన్నయ్య ను కట్టేసుకునే భాగ్యమే... ఇది ఖచ్చితం గా కేక.. ధన్యవాదాలు.
@ విజయ్ మోహన్ గారు: అది నా అదృష్టం ధన్య వాదాలు.
@ మురళి: అదే కదండి కృష్ణయ్య గొప్పతనం, ధన్యవాదాలు.
@ మాల గారు, జ్యోతి, నేస్తం: ధన్యవాదాలు.
@ మైత్రేయి: గోపిక గా ఈసు వుండటం సహజమే కాని మర్చి పోకు కృష్ణయ్య ఎప్పుడు గోపికా లోలుడే మీ దగ్గరకు రాక ఎక్కడికి పోతాడు... ;-) ధన్య వాదాలు

@ శ్రీ లలిత : వచ్చెయ్యండి మరి చూపిస్తాను కృష్ణయ్య ను.

@పరిమళం: తాయిలాలకు ఆశపడి వచ్చాడండోయ్ కన్నయ్య. :-) ధన్య వాదాలు

@ మధురవాణి: మీ దీవెన ఫలించి కృష్ణయ్య ఎప్పటికి నాతోనే వుండాలని నేను కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.

@ ఉష: ఆ ఇమేజ్ చదివే మీ మనసు ను బట్టి ప్రతిఫలిస్తుందనుకుంటా. అది మీ మనసు గొప్పతనం నా రాతలది కాదు. ధన్య వాదాలు.

తృష్ణ చెప్పారు...

chaalaa aanamdam kaligimdamdi chaduvutumte..

భావన చెప్పారు...

తృష్ణా,
అదే ఆ ఆనదం కలగటమే నేమో కృష్ణ తత్వం అంటే