డిసెంబర్ నెల కౌముది లో నా లేఖ
ఒంటరి గూడు
ప్రియమైన రాధి,
ఇంకా నువ్వు నాకు ప్రియమైన దానివే నీకు నేను కాక పోయినా.... అచేతనమైన మనః శరీరాలతో జీవితం పునఃసమీక్షించు కోవటం వలనేమో తప్పొప్పుల మాట అటుంచి అసలు ఈ చిందర వందర ఎక్కడ నుంచి మొదలయ్యిందో కూడా అర్ధం కావటం లేదు. జీవితం లో ఇంత దూరం వచ్చాక జీవితపు మొదలు ను పరిచయం చేసుకోవలసిన అవసరం రావటం నా వరకు దురదృష్టమనే అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావో కాని.
ప్రతి ప్రశ్న కు సమాధానం వుంటుందని ఎవరన్నారో కాని వాళ్ళకు వెళ్ళి చెప్పాలని వుంది, జీవితమే ఒక అంతు దొరకని ప్రశ్న రా ఇంక చిన్న ప్రశ్న లకు సమాధానం దొరుకుతుందా అని. నువ్వు నేను కలిసిన ప్రతి సారి ఒక వాగ్యుద్ధం మొదలైతే అది మన ఇద్దరి తెలివి తేటలకు ఒక చిహ్నమనుకున్నా, కాని అది పగిలే గుండెల దూరానికి పడే బీటు అనుకోలేదు. అవును మన పరిచయమే ఒక ఆర్గ్యుమెంట్ తో మొదలయ్యింది కదా. గుర్తు వుందా.. మొదటి సారి అంతరాష్ట్రీయ డిబేట్ టీం లో 'కుటుంబం అది పొందుతున్న సామాజిక మార్పులు అది గురి అవుతున్న మిథ్ లు' అనే విషయం మీద మన చర్చ. ఇద్దరం పూర్తి గా రెండు విభిన్న దృక్పధాలతో నాణేనికి రెండు పక్కలా చూపించటానికి ప్రయత్నించాము అని జడ్జ్ మనలను మెచ్చుకున్నాడు, కాని వాదన లో వున్న బలం మూలం గా నాకే మొదటి బహుమతి అని ప్రకటించినప్పుడు ఎర్ర బడిన నీ మొహం ఇప్పటికి నిన్నే జరిగినంత ఫ్రెష్ గా నా మది లో వుంది. ఇప్పుడు అనిపిస్తుంది అప్పటి నుంచి మన పరిచయం పెరిగిన ప్రతి మలుపు లో గెలుపు, ఓటములలో ప్రతి విషయాన్ని నువ్వు చాలా సీరియస్ గా తీసుకున్నావు అని.
కలిసి పెరిగిన అనుభందాల విలువలను.. అభిప్రాయాల తేడా లతో, అపార్ధాల నీడల .... తోసి రాజనుకోవటం నువ్వెందుకు చేసేవు అని నేను ప్రశ్నించను కాని ఏమైనా కారణం వుందా అని మాత్రం అడగాలి అనుకుంటున్నా. మనం 21 వ శతాబ్ధం లో వున్నాము ఇంకా ఆటవిక యుగం లో లేము కదా ప్రతి సమస్య ను చర్చల తో పరిష్కరించుకోవచ్చు అనే నువ్వే పెద్ద గా చర్చ అనేది లేకుండా జీవితం నుంచి బయటకు నడిచి నన్ను పిల్లలను కూడా ఎందుకంత చీకటి తెర ల వెనుక తోసేసేవు? కిందటి సారి కలిసినప్పుడు దాచి, దివ్వు ఇద్దరు నాతో సరి గా మాట్లాడ లేదు నాతో ఎక్కువ సేపు కలిసి వుండటానికి కూడా ఇష్ట పడ లేదు అది నాకు ఎంత క్షోభ గా వుంటుందో నీకు బాగా తెలుసు, తెలిసే వాళ్ళను అలా తయారు చేసేవు కదు. రాధి ఎందుకు నీకు ప్రతి విషయం లో ఇంత మొండి తనం.. 'నేను అనుకున్నదే జరగాలని' పంతం. తప్పు మానవ సహజం కాదా..... తప్పని తప్పు ఒప్పుకున్నాక కూడా జరిగిన వాటినే పదే పదే అనుకుని నాకు ఇంత గా శిక్ష విధించటం ఏమో మరి నీకు న్యాయమనిపిస్తుందా..
ఆలోచించు నువ్వేమి చిన్నపిల్లవు కాదు, నీ ఒక్క దాని అభిప్రాయం తో.... నీ ఒక్క దాని జీవిత విలువలతో (నువ్వు అనుకునే జీవిత విలువలు వాటిని నాకు ఆపాదించకు) మొత్తం కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసేవు.. రాధి ఈ రోజు కు నువ్వు ఇంటి నుంచి వెళ్ళి సవత్సరం అయ్యింది కాని నాకు మాత్రం గాయం ఇంకా పచ్చి పుండు లా కెలుకుతూనే వుంది.. ప్రతి క్షణం నువ్వు లేని లోటు నా జీవితాన కనిపిస్తూ నన్ను నా అంతట నేను స్వశక్తి తో ఆలో చించనియ్యకుండా నిర్వీర్యుడను చేస్తోంది. ఇంక ఇంత కంటే ఏమని చెప్పాలో కూడా అర్ధం కావటం లేదు..
ఒక స్థాయి కి వచ్చాక జీవితం మనదే కాదు అందరిది అని చెప్పే నీవే ఆ జీవితాన్ని మా అందరి దగ్గర నుంచి తీసేసుకుని నీ చేతి లో పెట్టుకుని ఆడిస్తున్నావు రా రాధి. నీకు తెలుసు ఆ విషయం. నీకు న్యాయమా నన్ను నా తల్లి తండ్రులతో మాట్లాడ వద్దు అనటం. వాళ్ళు నా తల్లి తండ్రులు. నా వలన కాదు రా అలా వాళ్ళను నిస్సహాయులను చేయటం. ఏమో రా రాధి ఆలోచించు వృత్తి రీత్య, ప్రవృత్తి రీత్యా కూడా ఆలోచించటం, పరిష్కారాలు వెతకటం నీకు అలవాటే కదా.. ఆలోచించు పరిష్కారం దొరుకుతుందేమో ఈ సమస్య కూ.
ఎక్కువ మాట్లాడే కొద్ది నేను బ్యాలెన్స్ ను కోల్పోతానేమో అని ఇక్కడి తో ఆపేస్తున్నా నా మనసు నీకు పంపే వినతి పత్రం మాత్రం నిరంతర సాగే స్రవంతి అని తెలుసు కదా..
ప్రేమ తో
ఎప్పటికి నీ
కృష్ణ.
కృష్ణా,
మీరు చెప్పిన ప్రతి మాట మీరు రాసినంత సూటి గాను అర్ధం అయ్యింది, ప్రతిపదార్ధాలతోనూ, టీకా తాత్పర్యాలతోనూ అర్ధం అయ్యింది. ఎంతైనా కలిసి సాగిన 12 ఏళ్ళ పరిచయం కదా. ప్రతి వాక్యానికి సమాధానం రాయాలనే వుంది కాని దాని వలన ఏమైనా వుపయోగం వుంటుందా అనే ఆలోచిస్తూ దాదాపు గా రెండు నెలలు చేసేను మీకు సమాధానం ఇవ్వటానికి. ప్రతి దానికి జీవితం లో లేటే గా నేను (మీరనే మాటే నాది కాదు). హ్మ్... విభిన్న దృక్పధాల విచిత్ర కలయిక మన పరిచయమైతే, ఆ విభిన్నత లోని మూలమే మనలను విడతీసిన కారణమని నేను అనుకుంటున్నా. "ప్రతి కలయిక విడిపోవటానికి నాంది" అని మీరు షాయరీ లు చెపుతూ అనే వారు గుర్తు వుందా.. అది గుర్తు వచ్చింది నాకు మీ వుత్తరం చదివేక.
హ్మ్.. పదాలను నేర్పు గా కూర్చే కళ మీకు స్వతహా గా దేవుడిచ్చిన వరం. అది పట్టుబట్టి నేర్చుకుని జీవనాధారం చేసుకున్న కధనం నాది. చూడండి ఇక్కడ కూడా నాణేనికి రెండు ప్రతిమలమే. అవును ప్రతి సమస్య ను చర్చలతోనో, మనం వున్న స్థాయి కంటే వేరే గా స్పందించి, ఆ కోణం లో పరిచయం చేసుకోవటం మూలం గానో పరిష్కరించవచ్చు అనుకునే దానిని నేను, కాని కొన్ని కొన్ని సమస్య లకు మౌనమే పరిష్కారమనిపించి మాట్లాడ కుండా వున్నాను.
ఏమని మాట్లాడమంటారు.. అభిప్రాయాల తేడా కాదు, అపార్ధాల నీడ అసలే కాదు మనలను విడ తీసినది జీవన విధానాల లోని.. నమ్మకాలలోని వైరుధ్యం కృష్ణా. మన జీవనం లో ప్రతి క్షణం వాటి మూలం గా కలిగిన ఘర్షణే ఈ మార్పు కు కారణం కాదంటారా. సహ జీవనానికి పునాదైన ప్రేమ నమ్మకం మన మధ్య న సడలి పోయాయి.. అది ప్రేమ కు పరాకాష్ట అని మీరనుకోవచ్చు. అనుకోవచ్చు ఏమి వుంది అన్నారు కూడా కదా... మీ వుత్తరం లో దానిని అడుగడుగునా ప్రదర్శించారు కూడా, కేవలం వాదన ల లోని అభిప్రాయ బేధమే గుండె గోడ లు బీట వారటానికి కారణమా? అది కూడా ప్రతి సారి ఆ వాదన ను 'నేను సీరియస్ గా తీసుకోవటం వలన' అని మీ అభియోగం. ఆపైన ఎందుకు చేసేవు అని నన్ను ప్రశ్నిస్తున్నారు.
మన మొదటి పరిచయం లోని టాపిక్ మీకు బాగా గుర్తు వుందే.. అవును కుటుంబం అనే మిథ్ మనం విడి పోవటానికి కారణం. కుటుంబం లో వుండవలసినవి అని మీరనుకున్న, మీరు వుంచిన...... పొరల మందం ఎక్కువ అయ్యి కలపవలసిన ప్రేమ, అనుభందం పల్చనైపోయినట్లుంది. తప్పు ను తప్పు అని ఒప్పుకోవటం మూలం గా ఒప్పు ఐపోదు కృష్ణా.. ఆ దిశ గా సాగే నడక ముఖ్యం. నడిచేరా మీరు ఆ దిశ గా ???? ప్రయత్నించారా? ?????ప్రేమ వివాహాలలో కూడ వివాహేతర సంబంధాలు వుంటాయి అంటే నేను నమ్మే దానిని కాదు, కాని అది నిజమై నా ముందు నిలబడి వెక్కిరించిన రోజు నా క్షోభ మీరు అర్ధం చేసుకున్నారా?
ఈ క్షణాన ఒంటరి తనం తో నిర్వీర్యుడైన నా జీవన సహచరుడా ఈ ఒంటరి తనం తో నేను నడిచిన క్షణాలన్ని యుగాలై ఇంకా నా వెనుక నీడ లానే వున్నాయి. ' తప్పే' అని ఒక్క మాట అంటే సరి పోయిందా. ఏమన్నారు నేను అడిగిన రోజు 'పదే పదే తప్పు చేసి ఒప్పంటున్నారు' అన్నప్పుడు...... నేను మొగవాడిని బయటకు వెళ్ళినప్పుడు వుండే అనేకానేక ఒత్తిడుల మధ్య న జరిగే ప్రతి విషయాన్ని, కేవలం మన మధ్య వుండే కాపురం ప్రేమ ల మధ్య కు కలిపి ముడి పెట్టకు అన్నారు. సున్నితమైన మనసు వుండటమే కాదు కృష్ణా అవతలి వాళ్ళకు కూడా అది వుంటుందని గుర్తించటం కూడా అవసరమే కాదు అంటారా.
మీ నాన్న గారి లానే మీరు ఆలోచిస్తున్నారు కాని ఆయన కంటే విధ్యాధికులు కదా, ఆ అధికత మీ తప్పు ను అందం గా కప్పి పుచ్చుకుంటానికి దానిని సమర్ధించుకోవటానికి మాత్రమే వుపయోగ పడింది. కాని బేసిక్ ఇన్స్టింక్ట్స్, ఆ పైన నన్ను అవమానించటానికి మీ నాన్న గారి తో కలిసి మీరు పెరిగిన వాతావరణమే ముందుకు వచ్చింది. అందుకే ఆ వాతావరణం పిల్లలకు వద్దని బయటకు వచ్చాను. అనుక్షణం తల్లి తెలివి తేటలు ప్రశ్నించ బడుతు, వెక్కిరించబడుతూ అంతలోనే ఆ కుటుంబం అనే మిథ్ తో ప్రేమించబడుతూ సాగే ఆ ద్వంద ప్రమాణాల జీవన విధానం వద్దు కనీసం ఆ లూప్ లో నుంచి పిల్లలనైనా బయటకు రాని కృష్ణా. నేను 12 సవత్సరాలు ప్రయత్నించాక అర్ధం ఐంది అందులోనే వుంటూ ఆ ద్వందత ను ఎదిరించటం కష్టం అని.
కలిసి సాగే సహ జీవనం లో ప్రేమ అనేది ఒక మిథ్ లా కాకుండ ఒకరికొకరు అనే మాట కు ఒకే అర్ధం తో, ఒకే ప్రమాణం తో, ఇల్లంటే మొగ వాడు అలసి ఇంటికి రాగానే అతని అలసట తీర్చి అన్ని అందించే ప్రేమ గోపురం ఆ ప్రేమ అందించే భార్య మూల స్థభం మే కాక, అలసి గూడు చేరిన గువ్వలు రెండిటిని కలిపే ఒక ప్రేమ గోపురమై, ఒకరికొకరు మానసిక ఆలంబన ఇవ్వగల గూడవ్వాలని అటు వంటి భావి తరాన్ని తయారు చేయాలనే ఈ క్షణపు నా ఒంటరి గూడు ను నా చేతులతో నిర్మించుకుంటున్నా.. దాని అర్ధం, విలువ మీకు తెలిస్తే ఎప్పుడైనా తలుపు తట్ట వచ్చు.
రాధిక.
49 కామెంట్లు:
అరె! నాకు తెలిసి నా స్నేహితురాలోకళ్ళు అచ్చంగా ఇలాంటి వ్యధలోనే ఉన్నారు. సరిగ్గా మీరు వాళ్ళను చూచి రాసినంత దగ్గరగా! వివాహేతర సంబంధాలు అన్నదాన్ని మినహాయిస్తే మిగిలిన కత అన్ని చోట్లా ఉంది.
ఎంత అధునికత సంతరించుకున్నా, భావావేశాలలో మార్పు రాదు. 'మనసు ' అర్ధమవటం చాలా కష్టం. బాగుంది భావన.
భావనగారూ,
కృష్ణను, రాధిని విడదీసింది వారి వారి జీవనవిధానాలలోని....నమ్మకాలలోని వైరుధ్యం అని బాగా చెప్పారు.
అనుక్షణం తల్లి తెలివితేటలు ప్రశ్నించబడుతూ, వెక్కిరించబడుతూ...ఓహ్.. అటువంటి కుటుంబాలెన్నో..
ఒక్కొక్కరికి ఒక్కొక్కరుచి అన్నట్టే విలువలు కూడా ప్రతి వ్యక్తికీ మారుతూంటాయి. అబధ్ధమాడడం అన్నది కొందరికి చాలా మామూలు విషయమయితే మరికొందరికి అదే ఘోరాపరాధమనిపిస్తుంది. అలా అనిపించడానికి వాళ్ళు పెరిగిన వాతావరణం, ప్రస్తుత ముంటున్న సమాజం అన్నీ కారణాలవుతాయి.
భర్తలకున్న వివాహేతర సంబంధాలు ఒక తరం క్రితంవరకూ అయితే భార్యలు మౌనంగా భరించేవారు. ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవడం ఒక కారణ మయితే, దెబ్బలాడి విడిపోతే పిల్లల ను ఈ సమాజం లో సెటిల్ చెయ్యడం కష్టమనే కారణం మరొకటి. అలా ఉండడానికి వాళ్ళు వాళ్ళ మనసుల్ని ఎంతగా చంపుకున్నారో తల్చుకుంటే గుండె చెరువవుతుంది.
రోజులు మారాయి. ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది. అందుకే మీ రాధి తన మనసును చంపుకోకుండా పిల్లలపై అటువంటి ప్రభావం పడకూడదని విడిగా వచ్చేసింది. తన మనసును చంపుకోలేదు తప్పితే హృదయాన్ని కృష్ణ నుంచి విడదీసుకోలేకపోయింది. అందుకే ఆమె విలువలను గౌరవిస్తే అతనిని స్వాగతిస్తానని తెలియపరచింది.
భావితరాని కి మంచి అందించాలన్న తపనతో గూడు లో ఒంటరిగా ఉండిపోయిన రాధి మనసు తెలుసుకుని కృష్ణ వస్తాడనే ఆశిద్దాం....
ఎలా చెబితే బాగుంటుందో ఇద్దరికీ
సునీత: అవును మీరు అన్నట్లు ఈ కత అన్ని చోట్ల వున్నదే .. ఎప్పటీ నుంచో వున్నదే శ్రీ లలిత గారు అన్నట్లు ఒకప్పుడు అణచబడింది ఇప్పుడూ వాణి వినపడుతోంది అంతే.. విడాకులు సరి ఐన పరిష్కారం అవునా కాదా అనే దానికంటే నమ్మకాల వైరుధ్యాన్ని ఎత్తి చూపించాలని ప్రయత్నించాను.
Wow .. well done.
ఇలాంటి కథలు అన్ని చోట్లా ఉన్నయ్యే. ఇమడలేక బయటపడే వాళ్లు కొందరయితే, బంధాలని తెంచుకోలేక..మనస్సుకి నచ్చచెప్పుకోలేక సతమతమయ్యేవాళ్లు కొందరు. కొన్ని మనసు భావనలు బయటి వాళ్లకి అర్థం కావు..అరే నిన్నా మొన్నటిదాకా చక్కగా అన్యోన్యంగా ఉన్నారే..వీళ్లు విడిపోవటం ఏంటి అని బయటవారు ముక్కున వేలేసుకుంటారు. బాధపడే మనసుకి తెలుసు దాని వెనక కారణాలు.
మీరన్నట్టు ఒకప్పుడు అణచబడింది ఇప్పుడు వాణి వినపడుతుంది. Excellent Bhavana!
ప్రియమైన రాధీ,
నా మనసంతా తెల్లకాగితం. నువ్వెలా అనుకుంటే అలా కనిపిస్తాను.
ప్రేమతో
కృష్ణ
కృష్ణా
తెల్లకాగితాన్ని అర్థం చేసుకొనే శక్తి నాకు లేదు. మనసులో ఉవ్వెత్తున ఎగిసే భావాలు కన్నీరై నీవా తెల్లకాగితం పైన కనిపించకుండా వ్రాసిన "నల్లరాత" లను ఎప్పుడో తుడిచేసాను.దాన్ని మళ్ళీ తెలుపుచేసాను. దాని విలువ మీకు తెలిస్తే మీరెప్పుడైనా తలుపు తట్టవచ్చు
రాధిక
జయ... నిజమె ఆధునికత తో భావావేశం మారదు. మనిషి బలహీనత లు మారవు. ప్రపంచం లో అన్నిటి కంటే క్లిష్ట మైనది మనసు ను అర్ధం చేసుకోవటమే. ధన్యవాదాలు.
శ్రీ లలిత గారు. ఎంత బాగా విశ్లేషించారండి. అవును.. ఇప్పటికి ఒక తప్పు అది ఏది ఐనా కానిండి అమ్మాయి పక్క నుంచి అబ్బాయి పక్క నుంచి వేరు వేరు గా చూడ బడుతుంది. నా రాధి అన్నా అందరి లా కాకుండా వేరు గా ఆలోచించాలని నా ఆశ. బాగా విశ్లేషించారండి. రోజు రోజు కు మీ ఫేన్ ఐపోతున్నా నేణు మీ కామెంటు లు చూసి.
విజయ్ మోహన్ గారు ఒకరు చెపితే మారేవి కావండి ఇటువంటివి ఎవరికి వారు ఆలోచించుకోవలసినవి.. ఎలా చెప్పినా లాభం లేదు.. మొండి రాధి వెర్రి కృష్ణ... :-(
Thank You Thank you కొత్తపాళి గారు.
సిరి సిరి మువ్వ గారు: "కొన్ని మనసు భావనలు బయటి వాళ్లకి అర్థం కావు..అరే నిన్నా మొన్నటిదాకా చక్కగా అన్యోన్యంగా ఉన్నారే..వీళ్లు విడిపోవటం ఏంటి అని బయటవారు ముక్కున వేలేసుకుంటారు. బాధపడే మనసుకి తెలుసు దాని వెనక కారణాలు." చాలా బాగా చెప్పేరు అండి. పోస్ట్ కు ఇంకా క్లారిటి వచ్చినట్లు వుంది కామెంట్ తో.
భా. రా. రె... కన్నీరు ఎంత వెల్లువెత్తినా నల్లని రాత ను చెరిపి తెలుపు చేయ లేవు లే. కాగితం చిరిగి పోతుంది మరీ నీరు ఎక్కువ ఐతే. ;-)
ఈ మధ్య ఇలాంటి సంఘటనలు చాలా వింటున్నాము . వివాహేతరమే కానవసరము లేదు , పరిధి పెరిగినా కొద్దీ కుంచించుకు పోతోంది .
బాగా వ్రాసారు .
>> ఈ ఒంటరి తనం తో నేను నడిచిన క్షణాలన్ని యుగాలై ఇంకా నా వెనుక నీడ లానే వున్నాయి
>> ప్రేమ నమ్మకం సడలిపోయాయి
నీ భావనలోని గాఢతకి ఈ రెండు కొలమానాలు చాలు. ఇక్కడ రెండు మనసుల సంఘర్షణ. ఈ మాటలు యండమూరి పాత్రవి "విడివడటం ద్వారా మీరు సంతోషంగా వుంటారన్న గ్యారంటీ మీకుంటే, మీరు లేని ఆమె భవిష్యత్తు మిమ్మల్ని మానసికంగా బాధపెట్టదన్న నమ్మకం మీకుంటే.." అలాగే ఇక్కడ రాధి, కృష్ణ పరస్పరం ఆ అనురాగ లేమిని ఫీలవుతున్నారు. మనిషికి సధనచేత అలవడే దైవత్వం క్షమ. ఇక రాజీ అన్నది, విరోధం అన్నది ఆ సాధన తలపడాల్సిన వైరి బలగాలు. ఒక్కోసారి రాజీ కూడా కాల్చుకుతింటుంది. మనసు ఒక విహంగం. మనం దాని నీడలం. ఒక్కోసారి దానికన్నా సాగి పెద్దగా, ఒక్కోసారి అసలు లేనట్లే మనని మనం కనుమాయ చేసుకుంటూ, మరోసారి సాక్షాత్కారం చేసుకుంటూ...
రాధి, కృష్ణ రెండు వైరుధ్యాల ప్రతీకలు. ఆ గీతల కలయిక కాలానికి వదిలేస్తూ..
హ్మ్ ........
విలువలు, చూసే దృష్టి కోణం వేరయినప్పుడు తలెత్తే సమస్య ఇది.. రాధిక నేటి తరానికి ప్రతినిధి అయితే, కృష్ణ నిన్నటి తరంలోనే ఉన్నాడు.. మన చుట్టూ రాధికలు పెరుగుతున్నంత వేగంగా కృష్ణ లు తగ్గక పోవడం తాలూకు ఫలితం విడిపోవడం.. సున్నితమైన అంశాన్ని చాలా చక్కగా డీల్ చేశారు, అది కూడా ఉత్తరాల రూపంలో.. అభినందనలు..
అవును మాల గారు. పరిధి పెరిగిన కొద్ది కుంచించుకుపోతోంది సంస్కారం. ఈ మధ్య ఇటువంటివి ఎక్కువ వినటానికి కారణం మురళి గారు ఎంత సరళం గా రాసేరో చూడండి. ధన్య వాదాలు.
జీవన గీతం లో వైరుధ్యం సహజం, ఒక విధం గా ఆ రాగానికి అందం ఇచ్చే ఒక మంచి ఫ్లేవర్ వైరుధ్యం. కాని అది ఒక పరిమితి దాటినప్పుడే మరి సమస్యలు. అలానే క్షమ అనేది కూడా ఆ ఫైన్ లైన్ గీయటం ఆ గీసిన గీత జీవిత బరి లో ఎటు వైపుకు పొసగకుండా వుంచటం తేలిక కాదు గా అక్కడే మరి మనసు చేసే మాయా జాలం పని చెసేది.. అవునా ఉషా... :-)... అవును బాగా చెప్పేవు గీతల కలయిక కాలానికే మరి వదిలేయటం. మన తరమా ఒక పక్కన వకాల్తా పుచ్చుకోవటం.
అదే కదా పరిమళం గారు.. హ్మ్మ్... అవును. :-)
మురళి: చాలా బాగా చెప్పేరు సున్నితమైన విషయానికి మూల కారణం.. ధన్య వాదాలు.
భలే రాశారు భావనగారు. కృష్ణ లేఖ చదివినపుడు అతనిపై కాస్త సానుభూతి కలిగింది. రాధిక వివరణ చదివాక ఈమె పాయింట్ కరెక్టే కదా అనిపించింది :-) ఇద్దరి భావాలలోని వైరుధ్యాన్ని చక్కగా చూపారు.
ఆ వైరుద్యాన్ని చూపటంలోనే కదా రచయిత్రి కౌశలం. ;) భావనా, ఇక నేను నీ పంకా!
ఈ మధ్య ఆడవాళ్ల వాణి వినిపిస్తుంది అంటున్నారు. అది వ్యక్తిగతంగా మంచిదేమో కాని సమాజపరంగా మంచిది కాదు. అందుకే దాన్ని సమర్ధించను. ఇది నా అభిప్రాయం. ఇకపోతే "విడిపోవడం, విడాకులు తీసుకోవడం.. సమస్యను దూరం చేస్తాయి కాని పరువు పోతుంది." అని.. ఈ మధ్యనే నేను చదివన కథలో కథానాయిక వాదన( నా వాదనకి మంచి పోయింట్ దొరికింది కదా! ). మీరేం చెప్తారు. మీ సమాధానం కావాలి.
ఇప్పుడు మీ రచన గురించి చెప్తాను. చాలా బాగా రాసారు. రెండు పాత్రల మనసులను తేటతెల్లం చేసారు. వారి ఆవేదనని, వారి మనసులోన భావాన్ని అక్షరబద్దం చేయడంలో పూర్తిగా విజయం సాధించారు. ఇది చదివిన తరువాత.. కృష్ణ, రాధిలు ఎంత బాధ పడ్డారో.. నేను అంతే బాధ పడ్డాను. నా గుండె కూడా అంత బరువెక్కింది. సూపర్బ్..
మీ సమాధానం కోసం చూస్తూ..
అయ్యో భావనా, కన్నీరు పెట్టి మనసును కడిగేయండి అంతే కానీ అదే పనిగా నానపెట్టొందండీ.
స్వతహా గా చెడ్డవాళ్ళు అంటూ చాలా తక్కువ వుంటారు వేణు శ్రీకాత్, అలాంటి విషయం లో ఇంక ఆలోచన లేదు చర్చ కూడా లేదు.. కాని మంచి చెడులు ఎవరి కోణం లో వాళ్ళు డిఫైన్ చేసుకుని ఎవరి వాదనలు వాళ్ళు వినిపించే ఒక జంట కధ ఇది.
ఉషా.. హెంత మాట హెంత మాట.. పొగడ్త మరీ ఇంత సంతోషం ఇస్తుందా.. ;-)
సవ్వడి గారు: హ్మ్.. ఎక్కడ మొదలు పెట్టాలి మీకు సమాధానం ఇవ్వటానికి. వ్యక్తి గతం గా మంచిది కానిదేది సమాజానికి మంచి చెయ్యదు అనా, సమాజమంటే మనమే, మన ఆలోచనా ధోరణి లో మార్పు అనివార్యం, అది ఆది నుంచి, అనాది గా జరుగుతున్న క్రమం అనా. పరువు అంటే... దానికి ఒక నిర్ధుష్టమైన ప్రమాణం ఏమి లేదు.. ఖచ్చితం గా విడి పోవటం విడాకు లు అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. కాని కొన్ని సమస్యలకు దురదృష్ట వశాత్తు అదే మంచి పరిష్కారమవుతుంది. ఆ పరిస్తితులు ఎలాంటివి ఏమిటీ అనేది ఎవరికి వారు ఆలోచించి తీసుకోవలసిన నిర్ణయమ్, మొత్తం గా అందరికి ఇలానే వుండాలి అందరు ఇలానే చెయ్యాలి ఇదే పద్దతి ఇలా కాక పోతే పరువు పోతుంది అనేది సమాజం లో కుదరని పని. ఎప్పుడూ ఏ కాలం లోను ఆచరణ కు వీలుకాని ఆచరణ లో లేని విధానం. దీని మూలం గా పిల్లలు కొంత వరకు ఎఫక్ట్ అవుతారు, కాని కొన్ని సార్లు స్లో పాయిజన్ తో పిల్లలను పెంచటం కంటే ఒక్క సారి భరించలేని చేదు మాత్ర ఇచ్చి రోగాన్ని నయం చేయటం అవసరమవుతుంది. నేను ఇందాక చెప్పినట్లు ప్రతి సారి ఈ నిర్ణయం పరిష్కారం మారుతూ వుంటుంది. జనరలైజ్ చేయటం కుదరని పని. :-)
కధ నచ్చినందుకు ధన్య వాదాలు.
వూరుకో భా.రా.రె... ఏమిటి నాన పెట్టేది.. మినపప్పు. ;-)
కాకపొతే ఇక్కడొ లెక్కుందే మా చక్కానిచుక్కా! ;) పొగడ్త/ప్రశంస పన్నీరు వంటివి పైన జల్లుకోవటానికే. దాహార్తి తీర్చేది నీ భావావేశమే, వ్యక్తీకరణాను..... కాసేపు సుగంధాల అఘ్రాణింపు మంచిదేలే...
ఉషగారి మాటే నా మాట...కాసేపు ప్రశంసల జడివానలో తడిసి ముద్దవ్వండి.....అద్భుతంగా రాసారు..
ఇక మీ టపాలోని పాత్రల గురించి ఏంచెప్పాలో...ప్చ్...."गाठ अगर लग जायॆ तो फिर रिश्तॆ हो या डॊरी..लाख करॆ कॊशिश खुलनॆ मे वक्त तो लगता है...लंबि दूरी तै कर्नॆ मे वक्त तॊ लग्ता है...." నా ఉద్దేశంలో ఏ బంధమైనా తెంచుకోవటం చాలా సులభమైన పని అండి...నిలబెట్టుకోవటమే బహు కష్టం...ఆ నిలబెట్టుకోవటంలోనే ఉంది మనిషి గొప్పతనం...
భావనా, ఇప్పటికి మూడు సార్లు చదివి వెళ్ళిపోయాను, నా స్పందనకి తగిన మాటలు దొరక్క.. మళ్ళీ చదివాను.. ప్చ్.. ఇంకా తేల్చుకోలేను ఈ ఇద్దరిలో ఎవరు కరెక్టో! ఇద్దరి తరపునా ఎంత బలమైన వాదన సృష్టించేరో అసలు!! మనస్ఫూర్తిగా అభినందనలు :-)
కానీ ఒకటి మాత్రం నిజం.. చెడు వ్యసనాలు, చేయి చేసుకోవడాలు వలన దూరమయ్యే రోజులనించి మనోభావాలకి గౌరవమివ్వకపోవడం వలన దూరమయ్యే కాలానికి పయనించాము. వినడానికి కొంతమందికి వింతగానే ఉన్నా మొదటిదానికన్నా రెండోదే ఎక్కువ బాధ కలిగించే సంఘటనలు కోకొల్లలు..
తృష్ణ ధన్య వాదాలు నచ్చినందుకు.
ఇంక బంధమంటారా.. అది నిలబెట్టూకోవటం తెంచుకోవటం రెండూ మంచివే, రెండూ చెడ్డవే... ఈ ప్రపంచంలో ఏది ప్రమాణం అంటూ వుండదు, పాక్షికం గా మారుతూ వుంటుంది. ఇలానే మంచిది, అది ఇంతే అని నిర్ణయించలేము, అందునా ఇటూవంటి వాటికి పరిష్కారం ప్రతి జంట కు మారుతుందేమో అనుకుంటా నేను.
నిషి నచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి మనిషి కి తన తరపు నుంచి బలమైన వాదముంటుంది ఇతరులకు కాక పోయిన ఎవరికి వారు దానిని బలం గా నమ్ముతారు అనుకుంటా నేను. అందుకే అంత బలం గా రెండు పక్కల నుంచి వినగలిగేను. :-)
అవును సమస్య శారీరకమైతే తేలిక, మానసికమయ్యే సరికి కత్తి చాలా పదును ఒక మనసు లా ఇంకో మనసు ఆలోచించదు కదా.
భావాబివేశం, వ్యక్తీకరణ వినే వాళ్ళు అర్ధం చేసుకునే వాళ్ళు వుంటేనే కదా వెలింపు కు వచ్చేది. కాని నిజమే ఉషా, దాహాన్ని తీర్చేది వ్యక్తీకరణే.. 100% ఒప్పుకుంటాను.
మిమ్మల్నీ మీ లేఖల్నీ పొగడటం కూడా అనవసరమే. (అమ్మో ..కోప్పడేస్తారేమో), నా ఉద్దేసం ........ప్రత్యేకించి బావుందీ అని చెప్పాల్సిన అవసరం కనిపించదు. అన్నీ బెమ్మాండంగా వుంటాయీ అని .
భావన గారు! విమర్శిస్తారనుకున్నా అలా చేయలేదు సంతోషం.
"విడిపోవడం, విడాకులు తీసుకోవడం.. సమస్యను దూరం చేస్తాయి కాని పరువు పోతుంది." అన్న కథానాయిక మాటలో చాలా లోతు ఉంది. విడిపోవడం..సమస్యను దూరం చేస్తుంది కాని పరిష్కారం కాదు. అంటే సమస్య ఇంకా అలాగే ఉంటుంది. దాంతో పాటు పరువు కూడా పోతుంది అని నేను చదివిన విశ్లేషణ నచ్చి గుర్తుండిపోయింది.. మీరు దీన్ని అర్థం చేసుకునే సమాధానం ఇచ్చారు. బాగుంది.
అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉండదన్నారు. పరిస్థితులను బట్టి ఎవరికి వారే నిర్ణయం తీసుకోవాలన్నారు. అది కరక్ట్ నేను అంగీకరిస్తున్నాను. మీరు అన్నట్లుగా... దురదృష్టవసాత్తు విడిపోవడమే కొందరికి పరిష్కారం కావొచ్చు అన్నారు. అది బాధపడాల్సిన విషయమేమో అనిపిస్తుంది. దానివల్ల ఒకరికైనా మనఃశాంతి లభిస్తే నేను కూడా మనస్పూర్తిగా అంగీకరిస్తాను.
మీ సమాధానంలో నాకు బాగా నచ్చిన విషయం.. "వ్యక్తి గతం గా మంచిది కానిదేది సమాజానికి మంచి చెయ్యదు" అన్నారు. ఇక్కడే సంగ్ధిగ్ధంలో పడ్డాను. నేను చెప్పింది తప్పు కాదు. అలాగే మీరు చెప్పింది కూడా తప్పు కాదనిపిస్తుంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. మరి మీరేమంటారో...
ఇకపోతే నన్ను గారు.. గీరు.. అనడం నచ్చలేదు. అందులోనా మీరు నా "అమ్మబాబోయ్" చదివాక కూడా ఇలా అనడం అస్సలు నచ్చలేదు. నా పేరు తెలియకపోతే "సవ్వడి" అనండి చాలు. లేకపోతే "ఒరేయ్" అన్నా పర్వాలేదు.
చివరగా మీ బ్లాగులో "నా గురించి"లో.. "వునికి" అని ఉంది. కరక్ట్ పదం ఇది..."ఉనికి". సరి చేసుకోండి. మీ రచనలో కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి.
బాయ్!
లలిత అన్ని బెమ్మాడమైనా ఎంత బెమ్మాండమో చెపితే మేంకూడా కూసింత యాపీ అవుతాము కదా. అన్ని బెమ్మాండం గా ఏమి వుండవు లే నాకు తెలుసు అది మీ అభిమానం అంతే.
కృష్ణా, సరే పేరు పెట్టి పిలవ మన్నారు కదా తప్పకుండా.. :-)
కలిసివుండటం సమస్య లో భాగం ఐనప్పుడు విడి పోవటం సమస్య ను దూరం చేస్తున్నప్పుడు అది పరిష్కారం కాకుండా ఎలా పోతుంది? పరువు అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఒక ప్రమాణం వుండదు.. అది ఒక వ్యక్తి కాల మాన దేశ మానసిక పరిస్తితులను బట్టి వుంటుంది. ప్రతి వ్యక్తి ఒకలా నిర్వచించబడే పరువు గురించి ఆలోచించటం అవసరమా? అదేమిటి సమాజం లో పరువు అంటే చాలా మంది కి ఒకటే అభిప్రాయం వుంటుంది కదా అనకండీ. ఆలోచించండి మనసు పూర్తి గా దాని మీద పెట్టి, మన సమాజం లో కాలాన్ని పట్టీ (పాత కాలం, మధ్య కాలం, మొన్నీ మధ్య కాలం, ఈ కాలం ల లో వచ్చిన మార్పులు ఒకప్పుడు పరువు కానివన్ని ఇప్పుడూ పరువవుతున్నాయి అలనే ఒకప్పుడు చాలా పరువని భావించిన విలువలు ఇపుడు హాస్యాస్పదమవుతున్నాయి), ప్లేస్ ను బట్టీ (పల్లెటూరు, పట్టణం,నగరం ఇంకా రాష్ట్రాన్ని బట్టీ విలువలు మారతాయి), కులాన్ని,మతాన్ని బట్టీ ( బ్రాహ్మలకు పరువైన పని శూద్రులకు హాస్యాస్పదం కావొచ్చు వైస్ వెర్సా), మానసిక ( బలవన్తుడి పరువు మధ్యతరగతి వాడి పరువు, పేదవాడి పరువు ల ప్రమాణాలు ఒకటి కావు), ఇక లింగ వివక్షత ను బట్టి (ఆడ వాళ్ళ పరువు మొగ వాళ్ళ పరువు ఒకటి కాదు) ఇలా ప్రతి క్షణం మార్పు కు గురి అయ్యే ఒక మిథ్ పరువు విలువలు అనేవి. కాబట్టి మన సౌకర్యం కోసం పేర్చుకున్న ఈ గోడల మధ్య మనమే సమాధి కావటం సహించలేని స్త్రీ పురుషులు మన సమాజం లో ఎప్పుడూ వున్నారు వుంటారు. వారి నుంచే ఆది లో వెలివేయబడ్డ పనులు తరువాత సర్వ వ్యాప్తమై ఆచరించబడే పనులు మొదలవుతుంటాయి.
రెండో పేరా: కలిసి వుండే ఒక జంట విడి పోతుంది అంటే చాలా వరకు బాధ ఘర్షణ లేకుండా వుండవు కాని నిరంతర గా కాపురాలలో జరిగే ఘర్షణ దాని మూలం గా కోల్పోయే జీవితం, అందుమూలం గా తయారయ్యే వికృత రూపాల కంటే ఒక్క సారి ఘర్షణ నున్చి కలిగే బాధ చాలా మటుకు మంచిది ,మళ్ళీ ఇది మొత్తానికి జెనరలైజ్ చెయ్యలేము పరిస్తితులను బట్టీ మారుతూ వుంటుంది. బయట నుంచి మనం చేయవలసిన పని దగ్గరి వాళ్ళైతే మీకు మంచి అనిపించింది నెమ్మది గా చెప్పటం అది వాళ్ళకు కాదు అనుకున్నప్పుడూ వారికి ప్రశాంతం గా చేయుత నివ్వటం వీలైతే లేదా నెమ్మది గా తప్పుకోవటమ్ మన సొంత అభిప్రాయాలు విలువలతో వాళ్ళను జడ్జ్ చేయకుండా.
మూడవ పేరా: సమాజం వాటీ విలువలు మారే టప్పుడు దాని గురించి వివేక వంతులు పట్టించుకోరు. మంచి చెడులు మనం ఏవో అనుకుంటాము కాని అవి కాదు, ప్రకృతి నిర్ణయించిన మంచి చెడుల లెక్కలు వేరే వుంటాయి అవి మీరి నప్పుడు ఆ చెడు చేసినప్పుడే తప్పు ఈ మిగతావి అన్ని లెక్క కు రావు. ఆ ప్రకృతి నిర్ణయించిన మంచి చెడు లు ప్రశాంతం గా గురు ముఖం గానో మెడిటేషన్ ద్వారానో గ్రహించటానికి ప్రయత్నించండి.
ఇప్పటికే దాదాపు గా ఒక పోస్ట్ చేసినట్లున్నా సమాధానం, నా సమాధానం మీ ప్రశ్నలకు అణు మాత్రం చెప్పగలిగినా ఈ పోస్ట్ రాసిన కారణం నెరవేరబడిందని భావిస్తా. :-)
భావన గారు! ఎంత విశ్లేషణ ఇచ్చారండి... ఏకంగా ఒక టపాయే రాసారుగా! మొదటి మూడు లైన్లుతోనే నేను ఏకీభవించేస్తున్నాను. ఐనా అంత ఎలా రాయగలిగారండి. ముందు మీ సహనానికి.. ఆ తరువాత మీ విశ్లేషణకి జోహార్లు.
పరువు అనేది వ్యక్తి వ్యక్తికి, కాలాన్ని బట్టీ, సమాజాన్ని బట్టీ, కులాన్ని బట్టీ, మతాన్ని బట్టీ, ప్రాంతాన్ని బట్టీ, జీవన విధానాన్ని బట్టీ మారుతుంటుంది. దానికంటూ ఒక ప్రమాణం ఇవ్వడం వ్యర్ధం. కరక్ట్ గా చెప్పారు.
మంచి చెడుల లెక్కలు వేరే ఉంటాయి అన్నారు. ఇది కూడా కరక్ట్.
మీరు చెప్పదలచుకున్నది నాకు అర్థమైంది. రాధి, కృష్ణల విషయంలో మీరు చెప్పింది కరక్టే! విలువలు పాటించని వ్యక్తితో.. తనని సమర్థించే మరో వ్యక్తి(అతని తండ్రి) ఉన్న వాతావరణం నుంచి పిల్లలను దూరంగా తీసుకెళ్లిపోవడం మంచిదే!
ఇక నేను చెప్పదలచుకున్నదేంటంటే.. మీ రాధి, కృష్ణలను తప్పుపట్టి నేను ఈ ప్రస్న అడగలేదు. మీ టపాకొచ్చిన కామెంట్లు చదివాక.. నేను చదివింది గుర్తొచ్చి అడిగాను.
మీకు అభ్యంతరం లేకపోతే మీ వయసు.. మీరేం చేస్తున్నారో చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే మన వయసుకు మన రచనలకు సంబంధం ఉంటుందని నా అభిప్రాయం. అది కానప్పుడు మన వృత్తి ప్రభావమైనా ఉంటుంది. నేను ఇప్పటివరకూ రాసినవన్నీ ప్రేమ కథలే! మీలా రాయాలని ఆలోచనే రాలేదు. ఎప్పుడూ ప్రేమలోన కోణాలనే రాసాను. మరికొంత వయసొచ్చాక మీలా రాయలనిపిస్తుందేమో మరి. వయసు కారణం కానప్పుడు ఒక రచయితగా స్థిరపడాలనుకున్నప్పుడు మాత్రమే అన్ని రకాల కథలను రాయలని ఆలోచన వస్తుంది. ఇదే నిజమైతే నాకు మరే విషయం అక్కర్లేదు. ఈ రెండే అవ్వాలని రూలేం లేదులెండి... మినహాయింలు ఉంటారు. మీరు ఈ కోవకి చెందినవారైతే నేనేం చేయలేను. అన్నింటికి మించి మీ విశ్లేషణ, మీరు అర్థం చేసుకునే విధానం లేకపోతే జీవితాన్ని పరిశీలించే విధానం నచ్చి పై వివరాలు అడిగాను.. అంతే!
హ్మ్ అంతా అంగీకరించాక చెప్పడానికి ఏముంటుంది?
కృష్ణ గారు: నా టపా కొచ్చిన కామెంట్లు అన్ని ఈ టపా గురించి వారికి అనిపించిన భావం. మీకు ఎలా అనిపిన్చిదో అలా. దాదాపుగా అందరివి నేను రాసినట్లే వున్నాయి కదా..
నేను రచయత ను కాదు. నిజ జీవితం లో జరిగినవి, చూసినవి, చూస్తున్నవి నా ఆలోచనల తో కలిపి అందరి తో పంచుకుందామని చేసే ప్రయత్నం అంతే.
నిజమే వయసు కు, రాసే విధానానికి కొద్ది గా వుంటుందేమో సంభందం, నేను 25 ఏళ్ళవయసు లో ఐనా ఈ విషయం మీద ఇలానే రాసి వుండే దానినేమో కాని ఇంత విశ్లేషించి సమాధానం ఇచ్చి వుండే దానిని కాదు. పెద్ద దాన్ని అయ్యాను కాబట్టి కొంచం సంయమనం అలవాటు అయ్యింది అనుకుంటున్నా. నేను కంప్యూటర్ ఇంజనీర్ ను, ఖచ్చితం గా పెద్ద దానినే.. :-)
మహేష్: మీ అంగీకారమో అనంగీకారమో మీదైన స్టైల్ లో చెప్పండి మాస్టారు.:-)
అర్రెర్రే కళ్ళుకాయలు కాసేలా వైంటింగ్ చేసినా వయసు మాత్రం చెప్పలేదు కదా ... ప్చ్ ;)
నేను వాఖ్య పెట్టిన తరువాత రోజు చూసాను. మీరు స్పందించలేదు. మరి స్పందించరేమోననుకుని ఇంతవరకూ చూడలేదు. చూసాక మీరు మళ్ళీ మొదటికొచ్చారని అనిపించింది. ఏంటంటే.. నన్ను గారు అనడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాగైతే మీ జట్టు ఉండను.
హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
happy new year
భావన గారూ !
ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి